![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -247 లో.....ఇన్‌స్పెక్టర్ వచ్చి పెద్దసారుపై ఎటాక్ చేసింది ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు అని డౌట్ క్రియేట్ చేస్తాడు. ఒకరు మీ చెల్లికి మీకు గొడవ అయింది వాళ్ళు అయి ఉండొచ్చు.. ఇంకొకరు మీతో గొడవపడ్డ నాగభూషణం కొడుకు అయి ఉండొచ్చు.. ఎవరు అనేది తొందరలోనే చెప్తామని ఇన్‌స్పెక్టర్ అంటాడు. దాంతో వీరుకి టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత పోలీస్ వెళ్ళిపోతాడు.
ఇక వీరు దగ్గరికి రుద్ర వచ్చి.. బావ టెన్షన్ గా ఉందా.. వాటర్ తాగుతారా అని రుద్ర అడుగుతాడు. దాంతో వీరు వాటర్ తాగడానికి వెళ్ళిపోతాడు.
ఆ తర్వాత రంగా, గంగ, రుద్ర తమ గదిలో మాట్లాడుకుంటారు. ఏంటి సర్ మీరు.. మమ్మల్ని తొందరపడొద్దు అని చెప్పి.. మీరు కేసు ఫైల్ చేసారా.. తొందరపడ్డారేమో అనిపిస్తుందని గంగ అంటుంది. అదేం లేదు నేను ప్రీతీ గురించి అలోచించి అన్ని లైట్ తీసుకుంటున్నా అన్న ఆలోచనలో ఆ వీరు ఉన్నాడు. అందుకే ఇలా చేసానని రుద్ర అంటాడు.
ఆ తర్వాత రోజు బాక్సింగ్ ప్రాక్టీస్ కి రెడీ అవ్వమని గంగతో రుద్ర అంటాడు. నేను రానని గంగ అంటుంది. ఏమైందని రంగాని రుద్ర అడుగగా విశ్వనాథ్ ఇంట్లో జరిగింది మొత్తం చెప్తాడు. రుద్ర కోపంగా ఉంటాడు. మీరు అతన్ని ఏం అనకండి సర్ అని గంగ అంటుంది. అంటాను తనకి తన ఆలోచనలు తప్పని తెలిసేలా చేస్తానని రుద్ర అంటాడు.
మరొకవైపు గంగకి తన భర్త తరుపున సారీ చెప్పాడానికి సుధా వెళ్తుంటే ఎక్కడికి అని విశ్వ అంటాడు. గంగ ఇంటికి అని సుధా చెప్తుంది. ఎందుకు? అన్నయ్య నేను పెళ్లి చేసుకొని తప్పు చేసానని క్షమాపణ అడగడానికా అని విశ్వ అంటాడు. నేను వెళ్ళేది గంగ దగ్గరికి అని సుధా అంటుంది. ఆ గంగ మీ రెండో అన్నయ్య కోడలు అని విశ్వనాథ్ చెప్పగానే సుధా షాక్ అవుతుంది. అంటే రుద్ర నా మేనల్లుడు అని సుధా ఎమోషనల్ అవుతుంది. పోయిన బంధాలు కలపాలని ట్రై చెయ్యకని విశ్వ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.
ఆ తర్వాత శకుంతల దగ్గరికి వీరు, ఇషిక వెళ్లి కేసు ఇన్వెస్టిగేషన్ వల్ల ప్రీతీ డిస్టబ్ అవుతుందని అంటాడు. నేను కేసు వెనక్కి తీసుకోమంటానని శకుంతల అంటుంది. పెద్దసారు దగ్గరికి శకుంతల వెళ్లి మాట్లాడుతుంది. ప్రీతీ డిస్టబ్ అవుతుందని శకుంతల అంటుంది. అప్పుడే రుద్ర ఎంట్రీ ఇచ్చి కేసు వెనక్కి తీసుకుంటాను.. నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తాను.. కొన్ని క్లూస్ దొరికాయని రుద్ర అనగానే వీరు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |